Ajay Seth : మాజీ ఐఏఎస్ అధికారి (Former IAS officer), ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి (Former Finance Secretary) అజయ్ సేథ్ (Ajay Seth) ను కేంద్ర ప్రభుత్వం (Union Govt) ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’ ఛైర్పర్సన్ (Chairperson) గా నియమించింది. ఆజయ్ సేథ్ మూడేళ్ల కాలానికి IRDAI ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారని ‘ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ (ACC)’ వెల్లడించింది.
అజయ్ సేథ్ మూడేళ్లు లేదా ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చేవరకు లేదా తదుపరి ఉత్వర్వులు వెలువడే వరకు IRDAI ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతారని ACC తెలిపింది. పైవాటిలో ఏది ముందైతే అప్పుడు ఆయన పదవీకాలం ముగుస్తుందని పేర్కొంది. ఐఆర్డీఏఐ మాజీ ఛైర్పర్సన్ దేబాషిష్ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చి 13తో ముగియడంతో ఆయన స్థానంలో తాజాగా అజయ్ సేథ్‌ను నియమించారు.
అజయ్ సేథ్ 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2021 మే 1న ఆర్థిక శాఖలో చేరి 2025 జూన్ 30న పదవీ విరమణ చేశారు. సేథ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించారు.