సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్లకు కొదవేమీ లేదు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు..పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాణం పోస్తూ..చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh). కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ మహిళా ప్రధాన ఇతివృత్తంతో చేస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). డిఫరెంట్ జోనర్లలో సినిమా చేసే ఐశ్వర్యా రాజేశ్ ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతుంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ (Driver Jamuna Look) పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఏదో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నట్టుగా ఫస్ట్ లుక్‌లో కనిపిస్తుంది ఐశ్వర్య. అవుట్ అండ్ అవుడ్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్విస్టులు, కీలక మలుపులతో సాగనుంది. పా కిన్ స్లిన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డ్రైవర్ జమున ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.
తెలుగు, తమిళంతో ఇతర దక్షిణాది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది డ్రైవర్ జమున చిత్రం. ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. గతేడాది తెలుగులో నానితో కలిసి టక్ జగదీష్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి రిపబ్లిక్ సినిమాలో మెరిసింది ఐశ్వర్య. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద డీలా పడ్డాయి.
Here are the impressive first looks of @aishu_dil's #DriverJamuna 🚖#DriverJamunaFirstLook @kinslin @SPChowdhary3 @18Reels_ @GhibranOfficial @gokulbenoy #AnlArasu @thinkmusicindia #RRamar @reddotdzign1 @Synccinema @knackstudios_ @proyuvraaj pic.twitter.com/ssXTMMOYVw
— BA Raju's Team (@baraju_SuperHit) May 5, 2022