KGF Chapter 2 | 1000 కోట్ల క్లబ్‌లోకి కేజీఎఫ్ 2..తొలి శాండల్ వుడ్ సినిమాగా రికార్డు
పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కన్నడ, తెలుగు, హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇక మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిరిపోయే అప్ డేట్ రానే వచ్చింది.
కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసింది. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన మొదటి శాండల్ వుడ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది కేజీఎఫ్ 2. ఈ విషయాన్నితెలియజేస్తూ స్పెషల్ వీడియోను ట్వీట్ చేసింది శ్రీనిధి శెట్టి.పెద్ద సినిమాలు విడుదలవుతున్నా బాక్సాపీస్ వద్ద ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఇప్పటికీ తన రేంజ్ ఏంటో చూపిస్తూ ముందుకెళ్తోంది. మరోవైపు కేజీఎఫ్ చాఫ్టర్ 2 హిందీ బాక్సాపీస్ వద్ద రూ.400 కోట్ల మార్కును చేరుకునే దిశగా ముందుకెళ్తోంది.
కేవలం 14 రోజుల్లోనే రూ.350 కోట్లు సాధించి ఇప్పటికే రికార్డుల్లోకెక్కింది కేజీఎఫ్ చాఫ్టర్ 2. ఈ చిత్రంలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్, టాలీవుడ్ యాక్టర్లు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.
1000 CR MARK WORLDWIDE 🔥
Thankyou all🙏🏻♥️#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd pic.twitter.com/07CMvjHail
— Srinidhi Shetty (@SrinidhiShetty7) May 4, 2022
Read Also : Ajith Vijay Multi Starrer | విజయ్-అజిత్ మల్టీ స్టారర్..అన్నీ కుదిరితే ఇక విజువల్ ఫీస్టే ..!
Read Also : Hansika Motwani | మాల్డీవుల్లో మతులు పోగొడుతున్న హన్సిక..వీడియో వైరల్
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

