Prabhu Deva | కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా టాలీవుడ్ రీఎంట్రీ సినిమా ఇదే..!
మోసగాళ్లు బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో విష్ణు మంచు (Vishnu Manchu) ఎలాగైనా మంచి హిట్టందుకోవాలని కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో గాలి నాగేశ్వర్ రావు పాత్రలో కనిపించబోతున్నాడు.
కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు విష్ణు మంచు (Vishnu Manchu). చివరగా కాజల్‌తో కలిసి నటించిన మోసగాళ్లు బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఎలాగైనా మంచి హిట్టందుకోవాలని కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో గాలి నాగేశ్వర్ రావు పాత్రలో కనిపించబోతున్నాడు విష్ణు. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా..ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హీరోహీరోయిన్లపై వచ్చే ఓ పాటకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీ చేయబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. రామోజీఫిలింసిటీలో విష్ణు, పాయల్ పై వచ్చే ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తుండగా..ప్రభుదేవా నృత్య రీతులు అందిస్తున్నాడట.
చాలా కాలం తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ పాట సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలువనుందని చిత్రయూనిట్ చెబుతోంది. బాలీవుడ్ తార సన్నీలియోన్ ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

