భారీ అంచనాల నడుమ విడుదలై..ప్లాప్ టాక్ మూటగట్టుకుంది టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషించిన ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాగా..ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. అయితే సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా నష్టం వస్తే తాను షూరిటీ ఉంటానని భరోసా ఇచ్చాడట కొరటాల.
ఇక ప్రస్తుతం నష్టాలు వస్తుండటంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. సినిమాను భారీ మొత్తం పెట్టి కొనుక్కున్న పలువురు ముఖ్యమైన పంపిణీదారులకు వచ్చిన నష్టాలను సెటిల్ చేసే పనిలో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. కొరటాల ఈ చిత్రం కోసం నిర్మాతల దగ్గర ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఇప్పటికే అప్ డేట్ తెరపైకి కూడా వచ్చింది.
కెరీర్లో తొలిసారి ఆచార్య రూపంలో ఫెయిల్యూర్ రావడంతో ఆ బాధ్యతను తానే తీసుకోవాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. కొరటాల మరోవైపు త్వరలోనే ఎన్టీఆర్తో చేయబోయే 30వ సినిమాపైనే ఫోకస్ పెట్టనున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కింది ఆచర్య. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.