పూనమ్ కౌర్ (Poonam Kaur)..సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..ఎప్పుడూ ఒక అప్డేట్తో కానీ, స్టిల్‌తో కానీ నెటిజన్లను పలుకరిస్తుంటుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, తన పేరు దెబ్బతిన్నదని ఇప్పటికే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే పూనమ్ కౌర్ రహస్యంగా పిల్లలను కన్నదా..? అంటూ.. రీసెంట్గా పూనమ్ పోస్టు చేసిన ఫొటోకు ప్రశ్నలు, కామెంట్ల వర్షం కురిపిస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ఇటీవల ఇద్దరు పిల్లలను ఒడిలో పెట్టుకుని చాలా హ్యాపీమూడ్‌లో దిగిన స్టిల్‌ను పూనమ్ కౌర్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ ఇద్దరూ పూనమ్ కౌర్ కూతుళ్లు కావొచ్చని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సీక్రెట్ పెళ్లి చేసుకున్న పూనమ్..రహస్యంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశారు. దీనిపై అందరికీ క్లారిటీ ఇచ్చింది పూనమ్‌కౌర్. ఫొటోలో ఉన్నఇద్దరు పిల్లలు (Kids) తన బెస్ట్ ఫ్రెండ్ కూతుళ్లను స్పష్టం చేస్తూ..పుకార్లకు చెక్ పెట్టింది.
‘భరించలేనంత నష్టం జరిగింది చాలు..వీళ్లిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలు. పుకార్లకు క్లారిటీ ఇచ్చి..నన్ను ఊపిరి పీల్చుకునేలా చేసిన సోషల్ మీడియాకు కృతజ్ఞురాలిని’ అంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ప్రస్తుతం తెలుగులో నాతిచరామి సినిమాలో నటిస్తోంది పూనమ్ కౌర్.