హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నిధులతో ఉట్నూర్, నిర్మల్, అచ్చంపేట, దేవరకొండ, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట, వికారాబాద్, సిరిసిల్లలో గిరిజన, బంజారా భవనాల్లో అదనపు సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలయపాలెం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి, నారాయణఖేడ్ జిల్లా సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో నూతన గిరిజన, బంజారా భవనాలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఐటీడీఏ భవనాల నిర్మాణానికి రూ.15కోట్ల చొప్పున రూ. 30కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.