హయత్‌నగర్, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌లో ఓ పారామెడికల్ విద్యార్థి గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ సామనగర్‌లో నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా, పెద్దశంకరంపేట్, చిల్లపల్లి గ్రామానికి చెందిన రాయిని సాయిలు కుమారుడు రాయిని అనిల్‌కుమార్(21), హయత్‌నగర్‌లోని డీఎంఐటీ విజయ రీసెర్చ్ ఆఫ్ పారా మెడికల్ లేబరేటరీలో సెకండియర్ చదువుతున్నాడు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తుంటాడు.
గురువారం సాయంత్రం హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్నాడు. కాసేపటికి తోటి విద్యార్థులు వచ్చి పిలువగా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా అనిల్‌కుమార్ ఫ్యా నుకు వేలాడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనిల్‌ను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని కృష్ణవేణి దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టుగా నిర్ధారించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.