Ranbir Kapoor | యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే బాలీవుడ్ (Bollywood) యాక్టర్లలో ఒకడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ఈ స్టార్ యాక్టర్ ఓ వైపు లవర్ బాయ్‌గా కనిపిస్తూనే.. ఇంకోవైపు నటనకు ఆస్కారమున్న ప్రయోగాత్మక సినిమాల్లో నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి లీకైన రణ్ బీర్ కపూర్ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా నటన అనేది అందరికీ బయటి నుంచి కనిపించేంత గ్లామరస్ వృత్తి కాదని అంటున్నాడు రణ్‌బీర్ కపూర్. బీబీసీ చిట్‌చాట్ లో రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ.. యాక్టర్లకు బయట మంచి క్రేజ్, ఫేం ఉన్నప్పటికీ ఎప్పుడూ సంతోషంగా ఏం ఉండరని, తరచూ బాధలో ఉంటారని అన్నాడు. నటీనటులు వృత్తిపరమైన డిమాండ్స్ వల్ల వాళ్లు తినాలనుకునే ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలకు ఎప్పుడూ దూరమవుతుంటారని అన్నాడు.
మంచి శరీర సౌష్టవాన్ని మెయింటైన్ చేయాలనే ఒత్తిడి అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. నటీనటులు పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజీలో కనిపించాలంటే.. కఠినమైన ఆహారపు నియమాలను పాటించాల్సి ఉంటుందన్నాడు రణ్ బీర్ కపూర్. యాక్టర్లు ఆకలితో అలమటిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు తినాలనుకునే ఆహారాన్ని తినలేరు. నేనొక వేళ యాక్టర్‌ను కాకపోతే బరువు పెరిగినా పట్టించుకోకపోయే వాడిని. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు కూడా జీవితాన్ని కొంత ఆస్వాదించండి..అంటూ చెప్పుకొచ్చాడు.
రణ్ బీర్ కపూర్ మరోవైపు లవ్ రంజన్ దర్శకత్వంలో Tu Jhoothi Main Makkaar సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 8న విడుదల కానుంది.
Tu Jhoothi Main Makkaar ట్రైలర్ ..
Gopichand 31 | రూటు మార్చిన గోపీచంద్.. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో కొత్త సినిమా
Venkatesh | వెబ్ షోకు పనిచేయడం చాలా డిఫరెంట్.. వెంకటేశ్ చిట్ చాట్
Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..