కాసిపేట : భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ (ACP Ravi Kumar) అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం( Somagudem) లో ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఏసీపీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరానికి గురిచేస్తు న్నాయని అన్నారు. అయితే వాహనదారులు అజాగ్రత్త, అతివేగంగా వాహనాలను నడపడంతోనే మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని పేర్కొన్నారు. డ్రైవింగ్‌లో తొందరపాటు తగదని సూచించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా భద్రత చర్యలను వివరించారు . ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.