కాసిపేట : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు( Road safety rules ) పాటించాలని, రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని దేవాపూర్ ఎస్సై గంగారాం ( SI Gangaram ) సూచించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ యాపలో స్థానికులకు రోడ్డు భద్రతపై అవగాహాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్( Helmet ) లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు, ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.