కారేపల్లి, నవంబర్ 03 : వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళా కూలీ పాము కాటుకు గురైన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కారేపల్లి భరత్‌నగర్‌కు చెందిన మైప స్వరూప గేటుకారేపల్లికి చెందిన రైతు పత్తి చేనులో పత్తి తీయడానికి కూలికి వెళ్లింది. పత్తి తీస్తుండగా చేనులో ప్రమాదవశాత్తు రక్తపింజర పాముపై కాలు వేయడంతో అది కాటు వేసింది. దీంతో బాధితులు కేకలు వేయడంతో వెంటనే ఆమెను కారేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.