Laura Wolvaardt : వరుసగా రెండోసారి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాకు ఓటమే ఎదురైంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న సఫారీ టీమ్ ఈసారి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు తలవంచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) స్పందిస్తూ తమకు భారత స్టార్ బౌలింగ్ తమకు పెద్ద సర్ప్రైజ్ అని వెల్లడించింది. పటిష్ట స్థితిలో ఉన్నవేళ ఆమె రాకతో బిగ్ వికెట్లు కోల్పోవడం తమ జట్టు విజయంపై ప్రభావం చూపించిందిన లారా చెప్పింది.
వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లను ఎదుర్కోవడంపై గట్టి కసరత్తు చేసిన దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. మిడిల్ ఓవర్లలో షఫాలీ బౌలింగ్‌కు రావడంతో ఆశ్చర్యపోయారు సఫారీ బ్యాటర్లు. ఇదే విషయాన్ని లారా వొల్వార్డ్త్ ప్రస్తావిస్తూ.. ‘ఫైనల్లో షఫాలీ వర్మ (Shafali Verma) బౌలింగ్ చేస్తుందని మేము ఊహించలేదు. టీమిండియా నుంచి మాకు పెద్ద సర్ప్రైజ్ ఆమెనే. తను వికెట్ల ముందు.. స్లో బంతులతో ఇబ్బంది పెట్టడమే కాదు రెండు వికెట్లు తీసుంది.
Three years. Three finals. Three losses
South Africa once again came agonisingly close to World Cup glory, only to fall short in the final stretch.
Reflecting on the loss, skipper Laura Wolvaardt admitted that Shafali Verma’s bowling took the Proteas by surprise.
✍️… pic.twitter.com/bPPvztl1gf
— Sportstar (@sportstarweb) November 3, 2025
వరల్డ్ కప్ ఫైనల్లో పార్ట్‌టైమ్ బౌలర్‌కు వికెట్ ఇవ్వాలని ఎవరూ కోరుకోరు. కానీ, మేము రెండు పెద్ద వికెట్లు ఇచ్చేశాం. మేము ఏమాత్రం షఫాలీ బౌలింగ్ కోసం సిద్ధం కాలేదు. తాను గొప్పగా బౌలింగ్ చేసింది. అదే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అయింది’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించింది.
డీవై పాటిల్ స్టేడియంలో భారత్ నిర్దేశించిన 299 పరుగుల ఛేదనను దక్షిణాఫ్రికా దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(23) త్వరగానే ఔటైనా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (101) క్రీజులో పాతుకుపోయింది. ఆమెతో కలిసిసునే లుస్(25) కీలక పరుగులు చేయడంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రధాన బౌలర్లను విసిగిస్తున్న ద్వయాన్ని విడదీసేందుకు ఆమె పార్ట్‌టైమ్ బౌలర్ అయిన షఫాలీ వర్మ(2-36)కు బంతి అందించింది. అదే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
Shafali Verma is an all in one package that India looking for decades
• destructive mindset like Sehwag
• Clutch player in knockouts like Yuvraj
• Never Play for stats and milestones
The Greatest Indian women cricketer I’ve seen in my life pic.twitter.com/J785YNf3O4
— Aditya Soni (@imAdsoni) November 2, 2025
కానీ, షఫాలీ స్లో డెలివరీతో మ్యాజిక్ చేస్తూ లుస్ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరిజానే కాప్‌ను ఔట్ చేసి సఫారీలను కష్టాల్లో పడేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ(5-39) ఐదు వికెట్లతో ప్రత్యర్థి విరిచింది. 46వ ఓవర్లో ఫినిషర్ డీక్లెర్క్(18) గాల్లోకి లేపిన బంతిని వెనక్కి పరుగెడుతూ హర్మన్‌ప్రీత్ అందుకోవడంతో భారత జట్టు తొలిసారి జగజ్జేతగా అవతరించింది.