హైదరాబాద్ : డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.