Asia Cup Final : అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఛేదనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అభిషేక్ శర్మ(5) ఫైనల్లో ఉసూరుమనిపించాడు. పెద్ద షాట్లతో విరుచుకుపడాలనుకున్న అభిని పాక్ పేసర్ ఫహీం బోల్తాకొట్టించాడు. స్లో డెలివరీతో ఈ చిచ్చరపిడుగును వెనక్కి పంపాడు.
ఆ కాసేపటకే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) లాంగాఫ్‌లో షాట్‌కు యత్నించి సల్మాన్ అఘా చేతికి దొరికాడు. దాంతో..2.3 ఓవర్లలో 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఓపెనర్ శుభ్‌మన్ గిల్(5 నాటౌట్), తిలక్ వర్మ (1నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇంకా టీమిండియా విజయానికి 135 రన్స్ కావాలి.