Srisailam Temple | శ్రీశైలం : శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజైన ఆదివారం భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
2/30
నల్లటి రూపంలో జుట్టు విరబూసుకుని భయంకరంగా దర్శనమిచ్చిన ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల విశ్వాసం.
3/30
ఆదిపరాశక్తుల్లో ఏడవ రూపమైన కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది.
4/30
ఈ దేవిని స్మరించిన మాత్రానే భూతప్రేత, పిశాచాదులు భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పండితులు చెప్పారు.
5/30
సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపైకి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను వేంచేపు చేసి.. శాస్ర్తోక్తంగా విశేష పూజలు చేశారు.
6/30
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించారు.
7/30
గ్రామోత్సవంలో భాగంగా గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారం నుంచి మంగళవాయిద్యాలు కళాకారుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, భజనల నడుమ వైభవంగా క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది.
8/30
ఇదిలా ఉండగా.. ఉదయం భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవారణార్చనలు, జపానుష్టాలు, పారాయణాలు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్టాలు, చండీపారాయణం, కుమారీ పూజలు చేశారు.
9/30
కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.