Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్లు తమ తడాఖా చూపించారు. లీగ్ దశలో పాకిస్థాన్‌ను పడగొట్టిన కుల్దీప్ యాదవ్ (4-30) తన మ్యాజిక్ చూపిస్తూ మరోసారి గట్టి దెబ్బకొట్టాడు. ఓపెనర్లు ఫర్హాన్(57), ఫఖర్ జమాన్(46)తొలి వికెట్‌కు 84 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. కానీ, పదకొండో ఓవర్ నుంచి వికెట్ల వేట మొదలెట్టారు వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇవ్వగా.. కుల్దీప్, అక్షర్ పటేల్(2-26) తిప్పేయడంతో పాక్ మిడిలార్డర్ క్యూ కట్టారు. బుమ్రా వేసిన చివరి ఓవర్ తొలి బంతికి పెద్ద షాట్ ఆడిన నవాజ్ (6) బౌండరీ వద్ద రింకూ సింగ్ చేతికి చిక్కాడు. దాంతో, పాక్ 146 పరుగులకే ఆలౌటయ్యింది.
పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను రెండుసార్లు చిత్తు చేసిన భారత్ ఫైనల్లోనూ అద్భుతంగా కట్టడి చేసింది. ఒకదశలో 84-1తో భారీ స్కోర్ దిశగా వెళ్తున్న పాక్‌ను 150లోపే పరిమితం చేసింది. స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్(4-30), అక్షర్ పటేల్(2-26), వరుణ్ చక్రవర్తి(2-30)లు చెలరేగిపోయారు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా.. ఆ తర్వాత గొప్పగా పుంజుకొని పాకిస్థాన్‌కు వరుసగా షాకిచ్చారు. 10వ ఓవర్ మూడో బంతికి ఓపెనర్ ఫర్హాన్‌ను ఔట్ చేసి వరుణ్ చక్రవర్తి తొలి బ్రేక్ ఇవ్వగా.. ఆపై కుల్దీప్ తన వంతు అన్నట్టు ఫామ్‌లో లేని ఆయూబ్(14)ను వెనక్కి పంపాడు.
An excellent bowling performance 👌
4️⃣ wickets for Kuldeep Yadav
2️⃣ wickets each for Jasprit Bumrah, Axar Patel and Varun Chakaravarthy#TeamIndia need 147 to win 🎯Updates ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Final pic.twitter.com/CNRcsGriwR
— BCCI (@BCCI) September 28, 2025
ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన మొహమ్మద్ హ్యారిస్(0) లాంగాఫ్‌లో రింకూ సింగ్ చేతికి చిక్కాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే హాఫ్ సెంచరీకి చేరువైన ఓపెనర్ ఫఖర్ జమాన్(46)ను వరుణ్ ఓవర్లో ఔటయ్యాడు. స్ట్రెయిట్ సిక్సర్ బాదిన ఫఖర్ ఆ తర్వాతి బంతినీ కవర్స్‌లో బౌండరీకి తలరించాలని అనుకున్నాడు. కానీ, అక్కడే కాచుకొన్న కుల్దీప్ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకున్నాడు.
లీగ్ దశలో నాలుగు వికెట్లతో పాక్ నడ్డివిరిచిన కుల్దీప్ ఈసారి కూడా విజృంభించాడు. ఓవర్లో తొలి బంతికే కెప్టెన్ సల్మాన్ అఘా(8)ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది(0) ఎల్బీగా వెనుదిరగగా.. చివరి బంతికి ఫహీం(0) సైతం ఔట్ కావడంతో 2 ఆలౌట్ అంచున నిలిచింది. 31 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయిన దాయాదిని బుమ్రా ఆఖర్లో వణికించాడు. ఆఫ్‌స్టంప్ యార్కర్‌తో హ్యారిస్ రవుఫ్‌ను బౌల్డ్ చేసిన అతడు.. నవాజ్‌ను డగౌట్ చేర్చి పాక్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
Jasprit Bumrah just cooked entire Pakistan with a final touch of celebration. Injected it to my veins. ❤️😭#TeamIndia #INDvPAK #AsiaCup pic.twitter.com/abP5yau8vJ
— Yash. (@TheSDELad) September 28, 2025