INDIA alliance | నేడు ఢిల్లీలో మధ్యాహ్నం ఇండియా కూటమి కీలక సమావేశం..బహిష్కరించిన డీఎంకే
దేశ రాజధాని ఢిల్లీలో నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జన్ బంధన్’(ఇండీ కూటమి) కీలక సమావేశం ప్రారంభం కానుంది.
INDIA alliance | దేశ రాజధాని ఢిల్లీలో నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జన్ బంధన్’(ఇండీ కూటమి) కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి 23 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఇండీ కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తృణమూల్ పార్టీ చీఫ్, మమతా బెనర్జీ హాజరై ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించనున్నట్లు తెలిసింది.
అయితే, డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఇటీవల తమిళనాడు ఎన్నికల తర్వాత మిత్ర ధర్మం పాటించకుండా కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్తో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ డీఎంకే నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్లో ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మరోవైపు టీవీకే పార్టీకి కూడా ఈ సమావేశానికి సమాచారం లేదని తెలిసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తూ వివిధల పార్టీలకు ఎంపీల ఆధారంగానే సమావేశానికి ఆహ్వానిస్తున్నామని వివరణ ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

