వరంగల్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాలతో పాటు సినీనటి సమంత విడాకుల వివాదం వంటి అంశాలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేయడంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించిన వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మంత్రి సురేఖ వ్యాఖ్యలు తన పరువుకు భంగం వాటిల్లేలా ఉన్నాయని కేటీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది.
శనివారం ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా దావానలంలా వ్యాపించడంతో వరంగల్ జిల్లాలో ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కొండా దంపతుల వ్యవహారశైలి మరోసారి చర్చనీయాశంమైంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు నిరాధార వ్యాఖ్యలు చేస్తే, రాజకీయ లబ్ధి కోసం సంచలనాలకు పోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో తమ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సురేఖ వ్యవహారశైలి ఇప్పటికైనా మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారు.
న్యాయస్థానం ఆదేశంపై సర్వత్రా హర్షాతిరేకాలు
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన న్యాయస్థానం ఆమెపై క్రిమినల్ కేసులు న మోదు చేయాలని ఆదేశించడంతో సర్వత్రా హర్షాతిరేకా లు వ్యక్తం అవుతున్నాయి. బాధ్యతాయుతస్థానంలో ఉన్నవాళ్లు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాయకుడిపై వ్యాఖ్యానించే సమయంలో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నా యి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, తమకు దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నదని మంత్రి సురేఖ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించడం గమనార్హం.