అమరావతి : ఏపీలో మరో 9 మంది ఐఏఎస్ అధికారులు ( IAS Transfers ) బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను విడుదల చేసింది. ఏపీ జెన్కో ఎండీగా ఐఏఎస్ అధికారిణి ఎస్ నాగలక్ష్మిని( Nagalaxmi ) నియమించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేద్కర్ , ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్గా అమిలినేని భార్గవ్ తేజను నియమించారు.
కృష్ణ జిల్లా జేసీగా మల్లారపు నవీన్, నెల్లూరు జిల్లా జేసీగా మొగిలి వెంకటేశ్వర్లు , రాష్ట్ర ఖాదీ బోర్డు సీఈవోగా కట్టా సింహాచలంను నియమించారు. రీహాబిలిటేషన్, రీసెటిల్ మెంట్ డైరెక్టర్గా పి. ప్రశాంతి,రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎ.మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది.