Yashasvi Jaiswal : ఐపీఎల్లో మెరుపు సెంచరీ.. టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)కు ఆసియా కప్ స్క్వాడ్‌లో మాత్రం చోటు దక్కలేదు. పవర్ హిట్టింగ్తో దంచికొట్టగల యశస్వీని పక్కన పెట్టేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మెగా టోర్నీకోసం తనను తీసుకోకపోవడంపై ఇప్పటివరకూ నోరు మెదపని యశస్వీ తాజాగా స్పందించాడు. తన టైమ్ వస్తుందని.. అప్పుడు కచ్చితంగా టీ20 జట్టులో ఉంటానని ఈ చిచ్చరపిడుగు చెప్పాడు.
నిరుడు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటనతో యశస్వీకి మార్గం సుగమం అయిందని అనుకున్నారంతా. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా చెలరేగి పోయిన అతడు అభిషేక్ శర్మకు జోడీగా ఆసియా కప్‌లో ఇన్నింగ్స్ ఆడుతాడని మాజీలు సైతం జోస్యం పలికారు. కానీ, అనూహ్యంగా శుభ్‌మన్ గిల్ పేరు తెరపైకి రావడంతో యశస్వీకి దారులు మూసుకుపోయాయి.
Yashasvi Jaiswal on his ommison from Asia Cup squad, a very mature statement unlike someone who
cried on Vikrant Gupta’s Sports Tak interview when he knew he might be omitted form T20 WC 2024 squad. pic.twitter.com/rILKOjRiNX— 𝑘. (@118atTheOval) September 19, 2025
తనపై వేటు వేయడంపై ఈ యంగ్‌స్టర్ మాట్లాడుతూ.. ‘స్క్వాడ్ ఎంపిక అనేది పూర్తిగా సెలెక్టర్ల పరిధిలోని విషయం. టీమ్ కాంబినేషన్ గురించి ఆలోచించి ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. అందుకే నేను ఎక్కువగా ఆలోచించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ప్రస్తుతానికి నా ఆటపైనే దృష్టి పెడుతూ మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాను’ అని యశస్వీ వెల్లడించాడు.
టీ20 సంచలనంగా పేరొందిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 23 మ్యాచుల్లో164.31 స్ట్రయిక్ రేటుతో 723 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక శతకం ఉన్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న యశస్వీ కల నిజం అవుతుందా? లేదా? మరికొన్ని రోజుల్లో తెలియనుంది.