భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 : రెడ్డిల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ఆదుకోవాలని, గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్లో శనివారం రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం సంఘ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు మేకల జంగారెడ్డి, ఉపాధ్యక్షులు నోముల సైదులు రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల భూపాల్ రెడ్డి, కోశాధికారి జిట్ట సత్యం రెడ్డి, నాయకులు నోముల మాధవరెడ్డి, వారాల సుధాకర్ రెడ్డి, ఎల్మ సత్తిరెడ్డి, యాస మంగారెడ్డి, మల్లెపల్లి కృష్ణారెడ్డి, మల్లెపల్లి సురేందర్ రెడ్డి, జిట్టా యాదిరెడ్డి, ఒంగేటి లింగారెడ్డి, ఎల్మ బాల్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, వంగేటి హనుమంత రెడ్డి, బద్దం మంగారెడ్డి, వందేటి విష్ణువర్ధన్ రెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.