OG Movie | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపైనే ఉన్నాయి. దీంతో ఈ సినిమాతో క్యాష్ చేసుకోవాలనుకున్న నిర్మాతలు.. ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు.
ఓజీ సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్లే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఒక జీవో ఇవ్వొచ్చు కదా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా అని నిలదీశారు. ఈ మేరకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు.