ఏప్రిల్ – మే మధ్య 330 అదనపు రైళ్లు : రైల్వేబోర్డు
అదనపు రైళ్లు | భారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్, మే మధ్య అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వే సిద్ధమైంది.

న్యూఢిల్లీ : భారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్, మే మధ్య అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వే సిద్ధమైంది. గోరఖ్‌పూర్, పాట్నా, ముజఫర్‌పూర్, వారణాసి, గౌహతి, ప్రయాగ్‌రాజ్, లక్నో, బరౌని, కోల్‌కతా, దర్భంగా, భాగల్పూర్, మాండూవాడి, రాంచీ తదితర ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు, 674 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే బోర్డ్ చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. ఇందులో 101 ముంబై నుంచి, 21 రైళ్లు ఢిల్లీ ప్రాంతం నుంచి నడువనున్నాయి. దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నా అదనంగా రద్దీ లేకున్నా.. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.

ఈ మేరకు రైల్వేశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 70శాతం రైల్వే సేవలు కొనసాగుతున్నాయని, డిమాండ్ ఉన్న చోట అదనపు రైల్వే నడుపుతున్నట్లు బోర్డు చైర్మన్ సునీత్ శర్మ పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 1,514 ప్రత్యేక రైళ్లు.. 5,387 సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అదనంగా రద్దీతో కూడిన 28 ప్రత్యేక రైళ్లకు క్లోన్ రైళ్లు, 984 ప్యాసింజర్ రైలు సర్వీసులు నడుస్తున్నాయని వివరించారు. కొవిడ్ కేసుల పెరుగుదల మధ్య సర్వీసులు నిరంతరం నడుస్తున్నాయని, డిమాండ్ ఉన్న చోట సర్వీసులు పెంచుతామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

