హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ముఖ్యమం త్రి కేసీఆర్ కొత్త జిల్లాలకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖను శాఖను పునర్వ్యవస్థీకరించి కొత్తగా 472 పోస్టులను మంజూరు చేసిన వి షయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు చీ ఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, 10 సరిల్స్, 13 డివిజన్లు, 79 సబ్-డివిజన్లు, 124 సెక్షన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. తన చాంబర్లో ఆసీనులైన మంత్రి వేములకు స్పీ కర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు.