కాజీపేట, ఆగస్టు 29: కాజీపేట రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు. కాజీపేట జిఆర్పి స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారంపై జీఆర్పీ ఎస్ఐ అభినవ్ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీలో భాగంగా ఇద్దరు పురుషులు, ఒక మహిళ చూసి అనుమానాస్ప దంగా సంచరిస్తుండటంతో వారిని అదుపు లోకి తీసుకున్నామన్నారు. వారి వద్దనున్న రెండు బ్యాగులను తనిఖీ చేయడంతో అందులో 32 కిలోల గంజాయి బయటపడిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.