నర్సాపూర్ : అక్రమ రేషన్ బియ్యం ( Illegal ration rice ) తో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్న సంఘటన నర్సాపూర్( Narsapur) పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్( SI Ranjeeth Kumar) తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు విజిలెన్స్ అధికారుల కళ్లుగప్పి ఇతర రోడ్డు గుండా 305 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు నర్సాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేశారని వివరించారు.
ఈ నేపథ్యంలో నర్సాపూర్లోకి లారీ ప్రవేశించగానే లారీని పట్టుకన్నామని వెల్లడించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో సహా 305 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులకు అప్పగించామని వివరించారు. లారీలో ఉన్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు తరలించామని పేర్కొన్నారు.