TTD Chairman | తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
TTD Chairman | ప్రజల్లో భక్తీ భావనను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu) వెల్లడించారు.
అమరావతి : ప్రజల్లో భక్తీ భావనను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu) వెల్లడించారు. చైర్మన్‌గా ఏడాది గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ఎయిర్‌పోర్టు (Tirupati Airport) కు శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టును ఆలయం సెట్ మాదిరిగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు
. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రం రాజధానిలో వేంకటేశ్వర ఆలయం నిర్మించాలని టీటీడీ(TTD) భావిస్తుందని తెలిపారు. ఏడాది కాలంలో అనేక సంస్కరణలు చేపట్టామని అన్నారు. భక్తులకు శీఘ్రగతిన దర్శణం కల్పించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగించుకోనున్నామని వెల్లడించారు.
గతంలో తిరుమలలో ఇష్టారాజ్యంగా 1,500 దుకాణాలకు అనుమతులు ఇచ్చారని, వాటన్నింటినీ క్రమబద్దీకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దుబ్బాక, కరీంనగర్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నామని ప్రకటించారు. ఒంటిమ్టిలో వంద గదుల వసతి గృహం నిర్మాణం చేయాలని వివరించారు.
కాణిపాకం ఆలయం వద్ద రూ. 25 కోట్లతో భవనాల నిర్మాణం, తలకోనలో రూ. 19 కోట్లతో ఆలయం అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

