Wounds | క్రీడల్లో పాల్గొన్నప్పుడు, వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు, పలు ఇతర సందర్భాల్లో మనకు అనుకోకుండా గాయాలు అవుతుంటాయి. అవి పుండ్లుగా కూడా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. గాయాలు అయినప్పుడు రక్తస్రావం కూడా ఒక్కోసారి అధికంగా అవుతుంది. అయితే గాయాలు మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సాధారణ గాయాలు అయినప్పుడు, పుండ్లుగా మారినప్పుడు, నొప్పి ఉన్నప్పుడు పలు ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. మన ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి గాయాలను, పుండ్లను, నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఆయా చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
గాయాలు, పుండ్లు, నొప్పిని తగ్గించేందుకు ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ ఆముదాన్ని తీసుకుని కొద్దిగా వేడి చేసి గాయంపై మర్దనా చేయాలి. తరువాత గాయం అయిన భాగాన్ని వస్త్రంతో చుట్టి కట్టులా కట్టాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత తీసేయాలి. రాత్రి పూట కట్టు కడితే రాత్రంతా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తీసేయాలి. దీని వల్ల నూనె లోపలికి శోషించుకోబడుతుంది. దీంతో గాయం త్వరగా మానుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గాయాలు, పుండ్లు, నొప్పులను తగ్గించేందుకు పసుపును కూడా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుండ్లు త్వరగా మానిపోతాయి. అన్ని రకాల గాయాలు, నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. పావు టీస్పూన్ పసుపును ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. ఉదయం, సాయంత్రం ఇలా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
గాయాలు, పుండ్లను తగ్గించేందుకు పసుపు, నెయ్యి మిశ్రమం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకు గాను కొద్దిగా పసుపు, నెయ్యిని తీసుకుని బాగా కలిపి పేస్ట్‌లా మార్చాలి. అనంతరం గాయాన్ని లేదా పుండును శుభ్రం చేసి దానిపై ముందు సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని రాసి ఆపై కట్టు కట్టాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేయవచ్చు. అలాగే అల్లంను తీసుకున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు. ఇవి నొప్పులను తగ్గించి గాయాలు త్వరగా మానేలా చేస్తాయి. రోజువారి ఆహారంలో అల్లంను చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు. లేదా అల్లం రసం తాగవచ్చు. అలాగే అల్లం రసం కలిపిన గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీని వల్ల కూడా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు త్వరగా మానుతాయి.
ఇక నొప్పులను తగ్గించి గాయాలు మానేలా చేయడంలో ఆవనూనె కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆవనూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అనంతరం దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మర్దనా చేయాలి. 15 నిమిషాల పాటు ఇలా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. అలాగే గాయాలపై రాసి కట్టు కడితే అవి త్వరగా మానిపోతాయి. అలాగే గాయాలు అయినవారు, నొప్పులు ఉన్నవారు పలు ఆహారాలను తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. పైనాపిల్ పండ్లను రోజూ తింటుండాలి. దానిమ్మ పండ్లను తింటున్నా ఉపయోగం ఉంటుంది. వీటి జ్యూస్‌ను అయినా తాగవచ్చు. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, పసుపు వేసి కలిపి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా ఆయా చిట్కాలను పాటించడం వల్ల గాయాలు త్వరగా నయం అయ్యేలా చూసుకోవచ్చు. నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.