సింధునదిలోకి దూసుకెళ్లిన వ్యాను.. 17 మంది మృతి!
సింధునదిలోకి దూసుకెళ్లిన వ్యాను.. 17 మంది మృతి! | పాకిస్థాన్‌లోని సింధునదిలో ప్యాసింజర్ వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది మరణించారు.

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని సింధునదిలో ప్యాసింజర్ వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహిళలు, పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 16 మంది ఉన్నారని, వ్యాన్ చిలాస్ నుంచి రావల్పిండికి వెళ్తుండగా చోటు చేసుకుందని కోహిస్తాన్ కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. టూర్ కోసం ఓ కుటుంబం వ్యాన్‌ను అద్దెకు తీసుకుందని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌తో సహా 17 మందితో ఉన్న వ్యాన్ పానిబా ప్రాంతానికి సమీపంలో నదిలో పడిపోయిందని పేర్కొన్నారు.
ఓ మహిళ మృతదేహం నది ఒడ్డున పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా.. సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌ను గుర్తించి వెలికి తీసిన అందులో మృతదేహాలు లభించలేదని తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని, నది ప్రవాహం ఎక్కువ ఉందని.. దీంతో ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనపై గిల్గిత్, బాల్టిస్తాన్ సీఎం ఖలీద్ ఖుర్షీద్ విచారం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్‌లాక్ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

