Kurmool Bus Accident | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు (DD01N9490) ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అయితే, ప్రమాదం అనంతరం ఈ బస్సు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సు పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. మొత్తం రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Bus
మరోవైపు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడీ (Fitness Validity) ముగిసినట్లు సమాచారం. అయితే, ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గానే ఉందని ఏపీ రవాణా శాఖ వెల్లడించింది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు తెలిపింది. 2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొంది. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకూ టూరిస్ట్ పర్మిట్ జారీ అయినట్లు వెల్లడించింది. ఈ బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉందని తెలిపింది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్లు వివరించింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
Also Read..
Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
Bus Accident | కర్నూలులో బస్సు ప్రమాదం.. 19 మృతదేహాలు వెలికితీత