హైదరాబాద్: కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల తక్షణ సాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
PM Narendra Modi: “Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured. An ex-gratia of Rs. 2 lakh… pic.twitter.com/SK0RmClDIk
— ANI (@ANI) October 24, 2025
మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం, సీఎస్, ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని, మృతుల కుటుంబాలకు సాయాన్ని ప్రకటించాలని ఆదేశించారు.