Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కాస్త మెరుగుపడింది. నిన్నటి వరకూ ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉన్న ఏక్యూఐ (AQI) లెవెల్స్.. ఇవాళ ‘పూర్’ కేటగిరీలో నమోదయ్యాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293 వద్ద నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రస్థాయిలోనే గాలి నాణ్యత సూచీ ఉంది.
అత్యధికంగా ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. అక్కడ గాలి నాణ్యత సూచీ 403గా ఉంది. ఇక అశోక్ విహార్‌లో 322, బవానాలో 348, బురారీ క్రాసింగ్ వద్ద 335, IHBAS దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో 307, ఐటీవో వద్ద 316, పంజాబీ బాగ్ వద్ద 313, పట్పర్గంజ్ వద్ద 324, ఆర్కేపురం వద్ద 315, షాదీపూర్ వద్ద 306, సోనియా విహార్‌లో 306, వివేక్ విహార్‌లో 346, వజీర్‌పూర్‌లో 337, అలీపూర్‌లో 285, అయా నగర్లో 236, సీఆర్పీఐ మధుర రోడ్లో 274, ద్వారకా సెక్టార్-8లో 290, ఎయిర్పోర్ట్ ప్రాంతంలో 257, డీటీయూలో 244, నోయిడా ప్రాంతంలో 264, గ్రేటర్ నోయిడాలో 272, ఘజియాబాద్‌లో 273, గురుగ్రామ్‌లో 208, ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 198గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజధానిలో క్లౌడ్ సీడింగ్ (cloud seeding) నిర్వహించాలని యోచిస్తోంది. ఇందు కోసం ఏర్పాట్లు పూర్తైనట్లు సీఎం రేఖాగుప్తా నిన్న ప్రకటించారు. బురారి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్ష సక్సెస్ అయినట్లు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే ఈనెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందన్నారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also Read..
Kurmool Bus Accident | కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుపై 16 చలాన్లు
PM Modi | ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
కేరళలో ఇన్స్టంట్ ఆన్లైన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్