కేరళలో ఇన్స్టంట్ ఆన్లైన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్
కేరళలో వివాహాల రిజిస్ట్రేషన్లు డిజిటల్ బాట పడుతున్నాయి. నవ దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వధూవరులు ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఈ-మెయిల్ ఆథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపు తనిఖీలను పూర్తి చేసుకోవచ్చు. తనిఖీ పూర్తయిన తర్వాత వెంటనే డిజిటల్లీ డౌన్‌లోడబుల్ సర్టిఫికేట్లు వస్తాయి.
తిరువనంతపురం : కేరళలో వివాహాల రిజిస్ట్రేషన్లు (Marriage Registration) డిజిటల్ బాట పడుతున్నాయి. నవ దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వధూవరులు ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఈ-మెయిల్ ఆథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపు తనిఖీలను పూర్తి చేసుకోవచ్చు. తనిఖీ పూర్తయిన తర్వాత వెంటనే డిజిటల్లీ డౌన్‌లోడబుల్ సర్టిఫికేట్లు వస్తాయి.
ఈ ధోరణి కేరళలో ఊపందుకుంటున్నది. 2024 జనవరి నుంచి 2025 సెప్టెంబరు మధ్య కాలంలో 1,44,416 వివాహాలు నమోదు కాగా, వీటిలో 62,524 వివాహాల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే జరిగింది. తాజాగా లావణ్య, విష్ణు దంపతులు వీడియో కేవైసీ ద్వారా కవస్సెరీలోని పంచాయతీ కార్యాలయంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.
వీరు ఆన్లైన్లోనే తమ వివాహ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకున్నారు. దంపతుల ఫొటోలతో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదే రోజు వచ్చింది. వీరిద్దరూ నవ్వుతూ, ఆన్లైన్లో తమ కేవైసీ వివరాలను వెరిఫై చేయించుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కేరళ ఓ ఉదాహరణగా నిలిచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

