Kyunki Saas Bhi Kabhi Bahu Thi2 | అపర కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రముఖ హిందీ సీరియల్లో కనిపించాడు. కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న పాపులర్ హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) ఈ సీరియల్లో అతిథి పాత్రలో మెరిశాడు బిల్ గేట్స్.
వర్చువల్ వీడియో కాల్లో కామియో పాత్ర చేసిన బిల్ గేట్స్ ఈ సీరియల్ ఐకానిక్ క్యారెక్టర్ తులసీ విరానీ(స్మృతి ఇరానీ) కనిపించగానే నమస్తే తులసీజీ ‘జై శ్రీ కృష్ణ’ అంటూ అభిమానులను ఆకట్టుకున్నాడు. అనంతరం గర్భిణీ స్త్రీలు, శిశువుల ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆన్లైన్ సమావేశంలో కలిసి చర్చించారు. ఈ చర్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో నిర్వహించబడింది.
जय श्री कृष्णा🙏@BillGates
VC: @StarPlus pic.twitter.com/gi0774BRbl
— Smriti Z Irani (@smritiirani) October 23, 2025