ఆగని బాదుడు.. హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్
ఆగని బాదుడు.. హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది.

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఏడు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. మరో వైపు డీజిల్ సైతం రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.41, డీజిల్ రూ.87.28కు చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 25వసార్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్రూ.107, లీటర్ డీజిల్ రూ.100కుపైగా దాటింది.
హైదరాబాద్‌లో రూ.100 దాటిన పెట్రోల్
తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కెట్‌ను ధాటింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.100.20కు చేరగా.. డీజిల్ లీటర్ రూ.95.14కు పెరిగింది. దాదాపు ఐదారు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెట్రోల్ రూ.102కుపైగా ధర పలుకుతుండగా.. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.రూ.96.41.. డీజిల్ ధర రూ.87.28
ముంబైలో పెట్రోల్ రూ.102.58.. డీజిల్ రూ.94.70
కోల్‌కతాలో పెట్రోల్ రూ.96.34.. డీజిల్ రూ.90.12
చెన్నైలో పెట్రోల్ రూ.97.69.. డీజిల్ రూ.91.92
పాట్నాలో పెట్రోల్ రూ.98.49, డీజిల్ రూ.92.59
లక్నోలో పెట్రోల్ రూ.93.40, డీజిల్ రూ.87.47
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
సైబర్ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వాన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

