సోమవారం 06 జూలై 2020
National - Jun 28, 2020 , 09:33:22

గ‌ల్వాన్ ఎఫెక్ట్‌: జొమాటోకు గుడ్‌బై చెప్పిన డెలివ‌రీ బాయ్స్‌

గ‌ల్వాన్ ఎఫెక్ట్‌: జొమాటోకు గుడ్‌బై చెప్పిన డెలివ‌రీ బాయ్స్‌

కోల్‌క‌తా: చైనా పెట్టుబ‌డులు పెట్టిన‌ కంపెనీలో ఉద్యోగాలు చేయ‌మంటూ  కొంతమంది జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్ త‌మ ఉద్యోగాల‌ను వ‌దులుకున్నారు. జోమాటోకు సంబంధించిన ష‌ర్టుల‌ను త‌గుల‌బెట్టి త‌మ దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలో పనిచేయమని శ‌ప‌థం చేశారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో శనివారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. 

గల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకున్నాయి. చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని, ఎవరూ వాడకూడదని ప‌లువురు రాజ‌కీయ‌ ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన కొందరు జొమాటో బాయ్స్‌ వినూత్న రీతిలో నిరసనలు తెలిపి దేశభక్తిని చాటుకున్నారు. జొమాటో అధికారిక టీషర్టులను ఓ చోట కుప్పగా పోసి తగలబెట్టారు. 


logo