Rekha Gupta | మీరు ప్రజాధనంతో శీష్ మహల్ కట్టుకున్నారు.. మేము మాత్రం : సీఎం రేఖా గుప్తా
Rekha Gupta | ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Rekha Gupta | ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం రేఖా గుప్తా (Rekha Gupta ) రూ.లక్ష కోట్లతో బడ్జెట్ (Delhi Budget)ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని, ఆ డబ్బును విలాసాల కోసం ఖర్చు చేసిందని ఆరోపించారు.
సీఎం అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) మరమ్మతుల పేరిట కేజ్రీవాల్ రూ.45 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని సీఎం ఆరోపించారు. ఢిల్లీని లండన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకు బదులుగా ట్రాఫిక్ జామ్‌లకు నిలయంగా మార్చారని మండిపడ్డారు. అంతేకాకుండా ఎన్నో ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు. ‘మీకు (ఆప్‌ను ఉద్దేశిస్తూ), మాకు (బీజేపీ) చాలా తేడా ఉంది. మీరు హామీలు ఇస్తారు. మేము వాటిని నెరవేరుస్తాము. మీరు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారు. మేము కలిసికట్టుగా దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నాము. మీరు శీష్ మహల్, లక్షల విలువైన బంగారు టాయిలెట్లను నిర్మించుకున్నారు. మేము పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లను నిర్మిస్తాము’ అని సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందుకోసం రూ.177 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో శీష్ మహల్ సందర్శన కూడా ఉంటుందన్నారు.
#WATCH | #DelhiBudget2025 | CM Rekha Gupta says, “… There is a lot of difference between us and them (AAP)… You (AAP) made promises, we will fulfil them. You abused the governments of the other states, we will establish harmony and work together… You made ‘Sheesh Mahal’, we… pic.twitter.com/41fWqtK9Pm
— ANI (@ANI) March 25, 2025
Also Read..
Bird Hit Flight | బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్ రద్దు చేసిన అధికారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

