Bird Hit Flight | కేరళ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానాన్ని (Bengaluru bound flight) పక్షి ఢీ కొట్టింది (Bird Hit Flight). దీంతో ఆ విమాన ప్రయాణాన్ని అధికారులు రద్దు చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Thiruvananthapuram airport) సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం 179 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం (6E 6629) బెంగళూరు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. టేకాఫ్‌కు కొద్ది సేపటి ముందు ఆ విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని రద్దు చేశారు. విమానం రద్దు కారణంగా అందులోని ప్రయాణికులు తీవ్ర ప్రభావితులయ్యారు. ఇండిగో సంస్థ మరో విమానంలో వారందరినీ సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరు చేర్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
Also Read..
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి