Loksabha Elections 2024 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విమర్శలు గుప్పించారు. దేశం క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొన్న ప్రతిసారీ దేశాన్ని విడిచి పారిపోయే తొలి వ్యక్తి రాహుల్ గాంధీయేనని ఆరోపించారు.
దేశం సమస్యల్లో కూరుకుపోయినప్పుడు విదేశాలకు పరారయ్యే రాహుల్ గాంధీని మీరు చూస్తుంటారని అన్నారు. మహారాష్ట్రలోని సంగ్లిలో బుధవారం జరిగిన బహిరంగ సభలో యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లారని, భూకంపం, వరదలు ఇతర విపత్తులు తలెత్తినప్పుడు ఇటలీకి పారిపోయారని గుర్తుచేశారు.
రాహుల్ ఇటలీ వెళ్లాలని అనుకుంటే ఇక్కడ ఎన్నికల్లో ఎందుకు సమయం వృధా చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ విదేశాల్లో ఉన్నప్పుడు భారత్ గురించి విమర్శలు గుప్పిస్తారని, భారత్లో ఉన్నప్పుడు దేశం తన పూర్వీకుల ద్వారా సంక్రమించినట్లుగా వ్యవహరిస్తాడని యోగి ఆదిత్యానాధ్ అన్నారు.
Read More :
MLA Jagadish Reddy | కేసీఆర్ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉంది