Kolkata Incident : కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (SP) లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్పీ చీఫ్‌కు మన ఆడబిడ్డల భద్రత గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. కోల్‌కతాలో యువ వైద్యురాలిపై దురదృష్టకర ఘటన జరిగితే దేశమంతా గళం విప్పారని, కానీ ఎస్పీ చీఫ్ నిస్సిగ్గుగా నిందితుడిని సమర్ధించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీలది జిన్నా ఆత్మ అని ఆరోపించారు.
జిన్నా దేశాన్ని విడదీస్తే కాంగ్రెస్, ఎస్పీలు ఇవాళ అదే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ హేయమైన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కోల్‌కతా ఘటనపై దేశం దిగ్భ్రాంతికి లోనయిందని, ఈ ఘటన గురించి వినగానే తాను కంపించిపోయానని అన్నారు.
మహిళలపై ఈ తరహా నేరాలు పెరిగిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. విద్యార్ధినులు, డాక్టర్లు, పౌరులు కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతుండగానే మహిళలపై నేరాలు పెరుగుతుండటం ఆందోళనకరమని చెప్పారు. చిన్నారులు సైతం బాధితుల్లో ఉండటం దిగ్భ్రాంతికరమని అన్నారు. కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి వేధింపులు జరగడం ఏ నాగరిక సమాజం అనుమతించబోదని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
Read More :
Viral Video | చిన్నారి – డాల్ఫిన్ మధ్య స్నేహపూర్వక సంభాషణ.. ఆకట్టుకుంటున్న వీడియో