Viral Video | ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్దే హవా. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ.. ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నారు. రోజువారీ ఆధునిక జీవితంలో ఇవి అంతర్భాగంగా మారాయి. ఇక ఇంటర్నెట్లో ఆకట్టుకునే కంటెంట్, వీడియోలకు కొదవ ఉండదు. ఎన్నో స్ఫూర్తిదాయక, నవ్వు తెప్పించే వీడియోలు, ఆలోచన రేకెత్తించే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా మరికొన్ని వీడియోలు (Viral video) ప్రేమతో హృదయాన్ని హత్తుకుంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఒక చిన్న పాప (toddler), డాల్ఫిన్ (Friendly dolphin) మధ్య స్నేహపూర్వక సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్వేరియంలోని డాల్ఫిన్‌ను చూసిన చిన్నారి ఎంతో ఉత్సాహంగా ఎగురుతూ హాయ్ చెప్పసాగింది. అది చూసిన డాల్ఫిన్ వెంటనే అక్కడ ఆగి చిన్నారిని పలకరిస్తున్నట్లుగా నోరు తెరిచింది. తన తోకపై నీటిలో నిల్చొని పాపతో ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చిన్నారి వెంటనే దానికి దగ్గరగా వెళ్లి ఎంతో మురిసిపోయింది. ఈ సన్నివేశం చిన్నారి – డాల్ఫిన్ మధ్య చాలా కాలంగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినా, ట్రెండింగ్ అమెరికన్ రీపోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Also Read..
Naga Chaitanya | వెడ్డింగ్ వివరాలు త్వరలోనే చెప్తా : నాగచైతన్య
MeToo | విజయన్ సర్కారుపై ప్రతిపక్షాల మండిపాటు.. ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నలు..!