Yamuna River | ఢిల్లీ (Delhi)లో యమునా నది (Yamuna River) నీటి ప్రవాహం (Water Level) డేంజర్ మార్క్ (Danger Mark)ను దాటింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీకి ఎగువన ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదికి వరద పోటెత్తుతోంది. పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద యమునా నది నీటిమట్టం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. గురువారం ఉదయం 8 గంటల సమయానికి నదిలో నీటి మట్టం 204.88 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.
నదిలో నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ (Hathnikund barrage) నుంచి ప్రతి గంటకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడం వల్ల యమునా నదిలో ప్రవాహం పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయానికి గరిష్టంగా 61 వేల క్యూసెక్కుల నీరు యమునా నదికి వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఓ సారి యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో రాజధాని ప్రాంతం నీట మునిగిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: The water level of the Yamuna River rises in Delhi.
Visuals from Loha Pul pic.twitter.com/nHII1ZqoTG
— ANI (@ANI) August 7, 2025
#WATCH | Delhi: The water level of the Yamuna River rises in Delhi.
Visuals from Loha Pul pic.twitter.com/7OMzykj2Ua
— ANI (@ANI) August 7, 2025
Also Read..
CRPF | ప్రమాదానికి గురైన సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనం.. ముగ్గురు మృతి