Ireland | ఐర్లాండ్ (Ireland)లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల చిన్నారి (Indian origin girl)పై తోటి పిల్లలు జాత్యాహంకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టు ఇండియా (go back to India)’ అంటూ బాలికపై దాడి చేశారు. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసినట్లు చిన్నారి తల్లి ఆరోపించారు. స్థానికంగా ఉంటున్న 10 నుంచి 14 ఏండ్ల బాలురు ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు.
ఆరేళ్ల చిన్నారి వాటర్‌ఫోర్డ్ (Waterford) నగరంలోని కిల్‌బర్రీ ప్రాంతంలో ఆగస్టు 4న సాయంత్రం సమయంలో ఇంటి ముందు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. అప్పటిదాకా అక్కడే ఉన్న చిన్నారి తల్లి.. పిల్లాడికి ఫీడింగ్ ఇవ్వడానికి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న బాలురు కొందరు బాలిక వద్దకు వచ్చారు. బాలికపై దాడి చేశారు. ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ప్రైవేట్ పార్ట్స్‌పై కూడా దాడి చేశారు. ఇండియాకు వెళ్లిపో అంటూ దూషించారు. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. బాలిక కేకలు విన్న తల్లి పరుగున వచ్చి చూడగా.. చిన్నారి తీవ్ర గాయాలతో భయంతో వణికిపోతూ కనిపించింది.
తాము కేరళలోని కొట్టాయం నుంచి చట్టబద్ధంగా ఐర్లాండ్‌కు వలస వచ్చినట్లు బాలిక తల్లి తెలిపింది. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇటీవలే పౌరసత్వం (Irish citizen) కూడా వచ్చినట్లు పేర్కొంది. తాను స్థానిక ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తున్నట్లు చెప్పింది. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయిందని వాపోయింది. ఈ దాడితో తన కూతురు తీవ్ర భయాందోళనకు గురైందని పేర్కొంది. తన కూతురుపై దాడి చేసిన పిల్లల్లో ఎనిమిదేళ్ల పాప కూడా ఉందని, మొత్తం ఐదుగురు దాడి చేశారని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఓ బాలుడు తన సైకిల్ వీల్‌తో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉన్న భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read..
Helicopter Crash | కూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులు సహా 8 మంది మృతి
Pak army chief | భారత్‌తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్