Helicopter Crash | పశ్చిమాఫ్రికా దేశం ఘనా (Ghana)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి (Helicopter Crash) ఇద్దరు మంత్రులు (Ghana Ministers) సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఘనా రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ పలువురు అధికారులతో కలిసి Z-9 హెలికాప్టర్లో రాజధాని అక్రా నుంచి ఒబువాసికి బయల్దేరారు. అయితే, కాసేపటికే హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మంత్రులు సహా అందులో ఉన్న ఎనిమిది మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలు తెలియరాలేదు. నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు వివరించారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
Also Read..
Pak army chief | భారత్తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్