Wrestlers | నిరసనల నుంచి వెనక్కి తగ్గలేదు..న్యాయం జరిగే వరకూ పోరాడతాం : రెజ్లర్లు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు (Wrestlers) తాము నిరసనల నుంచి వెనుతిరగలేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు (Wrestlers) తాము నిరసనల నుంచి వెనుతిరగలేదని స్పష్టం చేశారు. రెజ్లర్లు నిరసనలను విరమించారనే వార్తలు అవాస్తవమని, తాము రాజీపడలేదని, వెనక్కి తగ్గలేదని రెజ్లర్ సత్యవ్రత్ కదియన్ పేర్కొన్నారు.
నిరసనలను నిర్వీర్యం చేసేందుకు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ భర్త కదియన్ అన్నారు. తాము నిరసనల నుంచి వెనక్కిమళ్లలేదని, తామంతా న్యాయం కోసం ఐక్యంగా పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. తమను బలహీనపరిచేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని స్టార్ రెజ్లర్ మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసుల తీరును దేశం యావత్తూ తప్పుపడుతోందని అన్నారు. రెజ్లర్లు వెనక్కితగ్గలేదని, తాము ఉద్యమం విరమించామనే ప్రచారం వదంతేనని అంతకుముందు భజరంగ్ పునియా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఇక రెజ్లర్లు ఆందోళన విరమించారని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మరో రెజ్లర్ వినేష్ పొఘట్ ట్వీట్ చేశారు.
Read More
స్వీడన్లో శృంగార పోటీలపై సస్పెన్స్కు తెర..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

