స్వీడన్లో శృంగార పోటీలపై సస్పెన్స్‌కు తెర..!
స్వీడన్లో ఈ నెల నుంచి శృంగార పోటీలు జరుగుతాయని గత వారం రోజులుగా పలు కధనాలు వైరల్ అవుతున్నాయి. తొలుత ట్విట్టర్లో ఈ ఛాంపియన్షిప్ గురించి వార్తలు రాగా పలు వార్తా సంస్ధలు ప్రముఖంగా ప్రస్తావించాయి.
న్యూఢిల్లీ : స్వీడన్లో ఈ నెల నుంచి శృంగార పోటీలు జరుగుతాయని గత వారం రోజులుగా పలు కధనాలు వైరల్ అవుతున్నాయి. తొలుత ట్విట్టర్లో ఈ ఛాంపియన్షిప్ గురించి వార్తలు రాగా పలు వార్తా సంస్ధలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ ఈవెంట్ జూన్ 8న ప్రారంభమై పలు వారాల పాటు జరుగుతుందని, ఇందులో పాల్గొనే వారు రోజుకు ఆరు గంటల పాటు పోటీపడాలని వార్తలు వచ్చాయి. అయితే శృంగార పోటీలకు సంబంధించిన వార్తలు అవాస్తవమని స్వీడన్ వార్తా సంస్ధ గుటెర్బోర్గ్స్-పోస్టెన్ పేర్కొంది.
శృంగార పోటీలకు సంబంధించిన ప్రతిపాదనను ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారులు తోసిపుచ్చారని తెలిపింది. మానవులపై శృంగారం మానసికంగా ఆరోగ్యంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే అవగాహన పెంచేందుకు శృంగార పోటీలను నిర్వహించాలని స్వీడన్లో శృంగార ఫెడరేషన్‌ను నిర్వహిస్తున్ డ్రాగన్ బ్రాటిక్ ప్రతిపాదించారు. ఈ మేరకు శృంగారాన్ని క్రీడగా గుర్తిస్తూ తమను జాతీయ క్రీడా సమాఖ్యలో చేర్చుకోవాలని బ్రాటిక్ దరఖాస్తు చేయగా సమాఖ్య తిరస్కరించిందని తెలిపింది.
ఈ ఏడాది జనవరిలో బ్రాటిక్ దరఖాస్తు చేయగా ఇది తమ అర్హతలకు తగిన విధంగా లేదని తాము చేయాల్సిన ఇతర పనులు ఉన్నాయని స్పోర్ట్స్ ఫెడరేషన్ చీఫ్ ఎరిక్సన్ తేల్చిచెబుతూ దరఖాస్తును తిరసర్కించారు. స్వీడన్లో పలు స్ట్రిప్ క్లబ్‌లు నడుపుతున్న బ్రాక్టిక్ శృంగారాన్ని క్రీడగా గుర్తించాలని ఆశిస్తున్నారు. కాగా శృంగార పోటీలకు ఇప్పటికే 20 మంది దరఖాస్తు చేసుకున్నారని వార్తలు రాగా స్వీడన్ అధికారులు మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు.
Read More
Tillu Square | రొమాంటిక్ మూడ్‌లో డీజే టిల్లు.. సిద్దు జొన్నలగడ్డ టిల్లు 2 రిలీజ్ టైం ఫిక్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

