Ajay Banga | భారత (India) పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ (World Bank president nominee) అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga)కు కొవిడ్ (Covid-19) నిర్ధారణ అయ్యింది. మూడు వారాల ప్రపంచ పర్యటన (world tour)లో భాగంగా మార్చి 23న అజయ్ బంగా (Ajay Banga) ఢిల్లీకి (Delhi) చేరుకున్నారు. ఈ సందర్భంగా రొటీన్ పరీక్షల్లో (routine testing) ఆయనకు కరోనా పాజిటివ్ (Corona Positive)గా తేలింది. ప్రస్తుతం అజయ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ (Department of Treasury ) వెల్లడించింది.
‘రొటీన్ టెస్టింగ్‌లో భాగంగా అజయ్ బంగాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎటువంటి లక్షణాలు లేవు. అయితే, స్థానిక నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు’ అని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఓ ప్రకటనలో తెలిపింది.
అజయ్ బంగా (Ajay Banga) మూడు వారాల ప్రపంచ పర్యటన (world tour)లో ఢిల్లీ (Delhi) సందర్శన చివరిది. ఆఫ్రికా (Africa ) నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్ (Europe), లాటిన్ అమెరికా (Latin America) మీదుగా ఆసియా (Asia)కు చేరుకుంది. భారత్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో అజయ్ బంగా భేటీ కావాల్సి ఉంది.
కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో ఇన్ఫ్లూయెంజాతో పాటు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఏకంగా 1,300కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు రావడం 140 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.
Also Read..
Fake Websites | కేఎఫ్‌సీ పేరిట నకిలీ వెబ్సైట్.. ఫ్రాంచైజీ ఇస్తామని చెప్పి 95 లక్షలు వసూలు
Petrol Price | అత్యవసరమైతే తప్ప కార్లు వాడట్లేదు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పెను భారం