Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ప్రయాణికుల మధ్య ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న (Women passengers fight over seat) వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో.. లేడీస్ కోచ్‌లో ఇద్దరు మహిళలు సీటు కోసం వాదించుకుంటున్నట్లు కనిపించింది. తొలుత చిన్నగా మొదలైన వీరిద్దరి మధ్య వాగ్వాదం.. చివరికి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. చివరికి సీట్లో కూర్చున్న మహిళ లేచి మరో లేడీని జుట్టు పట్టుకుని లాగుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతుతారు. ఇంతలో ఓ మహిళ వారిద్దరి మధ్య గొడవను అడ్డుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
#delhimetro
दिल्ली मेट्रो में फिर हुआ सीट को लेकर बवाल pic.twitter.com/WXeKSQ1Z0r— Yug (@mittal68218) January 7, 2025
Also Read..
Nitin Gadkari | రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స.. కీలక పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి
OnePlus 13 | భారత్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్ ఫోన్లు లాంచ్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Elon Musk | ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి.. జనాభా తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన