OnePlus 13 | టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 13 ఫోన్‌ను భారత్‌లోకి వచ్చేశాయి. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్లో తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 (OnePlus 13)ను సంస్థ గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ (1440 x 3168 పిక్సెల్స్) కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుకవైపు 50 ఎంపీ LYT-808 main, 50 ఎంపీ అల్ట్రావైడ్, 50 ఎంపీ ట్రైప్రిజమ్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ 13 ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.69,999, 16GB + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.76,999గా నిర్ణయించారు. ఇక 24GB RAM + 1TB ధర రూ.89,999గా ఉంది. ఈ ఫోన్లు అమెజాన్ (Amazon) సహా ఇతర ఆన్లైన్/ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో జనవరి 10 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా రూ.5 వేలు ఆఫర్ పొందొచ్చు. అదేవిధంగా రూ.7వేల వరకూ అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Also Read..
Moto G05 | రూ.6999లకే మోటో జీ 05 స్మార్ట్ ఫోన్.. ఇవీ స్పెషికేషన్స్..!
Tata Sumo 2025 | ఆరు సేఫ్టీ బ్యాగులు.. పలు సేఫ్టీ ఫీచర్లతో నూతన అవతార్‌లో టాటా సుమో..!